దిగ్విజయంగా అధికారులు నిర్వహించిన మెగా జాబ్ మేళా
ఎల్బీనగర్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా నేడు 11th మే 2026 సోమవారం నాడు రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నందు మెగా జాబ్ మేళాను మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఐ.టి. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ముఖ్యఅతిధిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్రీమతి కె.కిరణ్మయి, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, టీయుఎఫ్ఐడిసీ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్లు శ్రీమతి శ్రీలక్ష్మి, డి. వినయ్ కుమార్, మహేష్, డీట్ డైరెక్టర్ జె. రాజేశ్వర్ రెడ్డి, టాస్క్ సీఈఓ నితిన్ కుమార్ రెడ్డి మరియు జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.ఇందులో ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ పరిశ్రమలు, ఐ.టి. కంపెనీలు, ఇతర సేవా రంగ సంస్థలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి దాదాపు 4318 మంది ఉద్యోగార్హులు జాబ్ మేళాలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి తమ ప్రసంగంలో ఈనాటి జాబ్ మేళా కార్యక్రమం గురించి మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి 123 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. జాబ్ మేళా నిర్వహిస్తున్న కంపెనీల విధానాల గురించి యువతకు తెలియజేశారు. ఉదాహరణకు ఏఐ, ఐటీ రంగాల, గురించి తెలియజేశారు. ఈ ప్రభుత్వం యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం యువత అపార అవకాశాలు గల ఉత్పత్తి, సేవా మరియు రవాణా రంగాల్లో యువత నైపుణ్యత పెంచుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన డీట్ నిరుద్యోగులకు, పరిశ్రమలకు మధ్య వారధిగా ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ప్రసంగిస్తూ నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశమే ప్రభుత్వ సంకల్పమని తెలియజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో 3716 ఉద్యోగార్హులు పాల్గొనగా 1645 మంది షార్ట్ లీస్ట్ కాగా 779 ఉద్యోగార్హులను ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైన కొంత మంది అభ్యర్థులకు ఐటీ మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందచేయడం జరిగింది.
