చోరీ కేసుల్లో పాత నేరస్థుడు అరెస్ట్

వివరాలు వెల్లడించిన టూ టౌన్ సీఐ ఉపేందర్

చోరీ కేసుల్లో పాత నేరస్థుడు అరెస్ట్

సిద్దిపేట:

సిద్దిపేట పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఉన్న “బాబా కమ్యూనికేషన్ అండ్ మొబైల్ షాప్”లో జరిగిన చోరీ కేసును టూ టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా టూ టౌన్ సీఐ ఉపేందర్ మాట్లాడుతూ, నిందితుడు శివరాత్రి దివాకర్ (26), వడ్డెర, ఖాతా గ్రామం, నంగునూరు మండలానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుండి రూ.12,800 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.ఈ నెల 9వ తేదీన షాప్ యజమాని ఇంటికి వెళ్లిన సమయంలో షాప్ షట్టర్‌ను తెరిచి లోపలికి ప్రవేశించిన నిందితుడు కౌంటర్‌లో ఉన్న రూ.14 వేల నగదును అపహరించినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. అదేవిధంగా ఈ నెల 8వ తేదీన రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాతా గ్రామంలో ఓ ఇంట్లో చోరీ చేసి రూ.2 వేల నగదు, ఒక వెండి కాలి పట్టీని దొంగిలించినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడని తెలిపారు. ఈ రెండు కేసులను పోలీసులు ఛేదించినట్లు వెల్లడించారు.నిందితుడిపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 20 చోరీ కేసులు నమోదై ఉన్నట్లు సీఐ ఉపేందర్ తెలిపారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు

About The Author