మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
ఘనంగా సత్కరించిన ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, మనీష్ గౌడ్
హైదరాబాద్:
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలు బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పీసీసీ మాజీ కార్యదర్శి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, యువ నాయకులు ముద్దగౌని మనీష్ గౌడ్ మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
మంత్రి నివాసానికి చేరుకున్న ముద్దగౌని బృందం ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రామ్మోహన్ గౌడ్ మంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రజా సేవలో మంత్రి పొన్నం ప్రభాకర్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.
ఎల్బీనగర్ అభివృద్ధిపై చర్చ..
మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, పలు అభివృద్ధి అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, ముద్దగౌని అనుచరులు పాల్గొన్నారు.
