స్వంత ఖర్చులతో బోరు మోటార్ అందజేసిన వార్డ్ మెంబర్ ఏయ్య భాస్కర్

స్వంత ఖర్చులతో బోరు మోటార్ అందజేసిన వార్డ్ మెంబర్ ఏయ్య భాస్కర్

దుబ్బాక:

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామంలోని 6వ వార్డు మెంబర్ ఏయ్య భాస్కర్ తన స్వంత ఖర్చులతో కాలనీ ప్రజలకు బోరు మోటార్ అందజేశారు. దీంతో కాలనీలో నెలకొన్న నీటి సమస్యకు తాత్కాలిక ఉపశమనం లభించిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి సహాయం చేస్తున్న వార్డ్ మెంబర్ ఏయ్య భాస్కర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయన నెరవేర్చుకుంటూ వస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. వార్డ్ మెంబర్ గా గెలిచిన మరుసటి రోజే వార్డులోని విద్యుత్ దీపాలను స్వంత ఖర్చులతో మరమ్మతులు చేయించి ప్రజల ప్రశంసలు పొందారు.

About The Author