ఎల్బీనగర్ 'సరూర్'నగర్ సర్కిల్లో పన్నుల మాయ!

  • నిబంధనలు 'నీరు'.. వసూళ్లలో 'జోరు'
  • రికార్డుల్లో మాయాజాలం: ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి
  • ప్రజయ్ ప్రిన్స్‌టన్ టవర్స్.. 'లక్షల' మాయ!
  • మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ టాక్స్ అధికారిని రాధిక గుప్తా ఐ.ఏ.ఎస్ ఏం.. చేస్తున్నట్లు...!
  • మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి మున్సిపల్ సెక్రెటరీ రంజన్ దృష్టి సారించాలి..

ఎల్బీనగర్ 'సరూర్'నగర్ సర్కిల్లో పన్నుల మాయ!

*సరూర్ నగర్:
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ లో ఎల్బీనగర్ జోన్ అత్యంత  కీలకమైనది, ఈ జోన్ లో నాలుగు సర్కిల్లు, వాటిలో ముఖ్యమైనది సరూర్నగర్ సర్కిల్ ఈ సర్కిల్ కు ప్రధాన అధికారి డిప్యూటీ కమిషనర్, భువనగిరి శ్రీనివాస్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కూడా మిగతా సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్ లేకపోవడం ఈ అధికారినే ఇన్చార్జ్ కమిషనర్ గా కొనసాగించడం ఆయన గారికి ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తోంది.. అవినీతి బాగోతంలోకి తొంగి చూస్తే...
నిబంధనల ప్రకారం వసూలు కావాల్సిన పన్ను.. అధికారుల కనుసన్నల్లో దారి తప్పుతోంది. నిక్కచ్చిగా ఖజానాకు చేరాల్సిన కోట్ల రూపాయల ఆదాయం, ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి మళ్లుతోంది. సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ (ఆస్తి పన్ను) వ్యవహారంలో జరుగుతున్న అక్రమాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. రికార్డుల మాయాజాలంతో బడా కమర్షియల్ భవనాలకు పన్ను రాయితీలు కల్పిస్తూ, సర్కారు ఆదాయానికి గండికొడుతున్న తీరు విస్తుగొలుపుతోంది.WhatsApp Image 2026-05-10 at 20.16.05 (1)

ప్రజయ్ ప్రిన్స్‌టన్ టవర్స్.. 'లక్షల' మాయ!

ప్రధాన వాణిజ్య భవనమైన ప్రజయ్ ప్రిన్స్‌టన్ టవర్స్‌కు సంబంధించి వెలుగు చూస్తున్న గణాంకాలు అధికారుల లాలూచీని స్పష్టం చేస్తున్నాయి.
 కేసు 1 (PTIN: 1031123514): ఈ భవనానికి ఏడాదికి రూ. 7,21,074 పన్ను చెల్లించాలి. 2025 మార్చిలో 'వేకెన్సీ రెమిషన్' (ఖాళీగా ఉన్నందుకు రాయితీ) పేరుతో రూ. 3,67,748 చెల్లించారు. అయితే, 2025-26 ఆర్థిక సంవత్సరానికి పూర్తిగా పన్ను మాయం, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేవలం రూ. 1,54,598 మాత్రమే బకాయిగా చూపిస్తున్నారు. అంటే, రెండు ఏళ్లకు కలిపి సుమారు *రూ. 12.87 లక్షల* ఆదాయం గాల్లో కలిసింది.
 కేసు 2 (PTIN: 1031123110):* ఇక్కడ అక్రమం మరింత భారీగా ఉంది. ఏడాదికి రూ. 30,73,044 పన్ను ఉండగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి టాక్స్ వసూలు చేయలేదు, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బకాయిగా కేవలం రూ. 2.98 లక్షలు మాత్రమే రికార్డుల్లో కనిపిస్తోంది. దీనివల్ల గత రెండేళ్లలో సుమారు *రూ. 58.47 లక్షల* నష్టం ప్రభుత్వానికి వాటిల్లింది.WhatsApp Image 2026-05-10 at 20.19.52

డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ ఇన్చార్జిఎంసి బాబురావు పై చర్యలు ఎక్కడ..!
దిల్‌సుఖ్‌నగర్ మెయిన్ రోడ్డులోని కోణార్క్ థియేటర్ ఎదురుగా(డోర్ నం: 13-9-11, 12) ఓ భారీ వాణిజ్య సముదాయంలో భారీగా ఆస్తి పన్ను ఎగవేత జరుగుతోందని , ఐదు అంతస్తుల ఈ భవనంలో ఏడాదిగా వ్యాపారాలు సాగుతున్నా, అధికారులు కేవలం రూ. 1.01 లక్షల పన్ను మాత్రమే వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఇది రూ. 10 లక్షలు దాటాలని, అధికారుల అండతోనే 90% పన్ను ఎగవేత సాగుతోందని 
​గతంలో పత్రికల్లో కథనాలు వచ్చినా సరూర్‌నగర్ సర్కిల్ అధికారులు రీ-అసెస్మెంట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
అవినీతి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు..

డిప్యూటీ' అండ.. వసూళ్ల దండా!
ఈ అక్రమాల్లో రెవెన్యూ విభాగం పాత్ర ప్రత్యక్షంగా కనిపిస్తోంది. సరూర్ నగర్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ మకత్ లాల్‌తో కలిసి సాగిస్తున్న ఈ వ్యవహారాలు మున్సిపల్ సర్కిల్‌లో బహిరంగ రహస్యమే. గతంలో గడ్డిఅన్నారం పరిధిలోని కమర్షియల్ భవనాల రీ-అసెస్‌మెంట్ల విషయంలోనూ ఇదే తరహాలో భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు ఇన్‌చార్జ్ ఏఎమ్మెసీ బాబురావుతో కలిసి సాగించిన 'దందా'పై ఇప్పటికీ విచారణ పెండింగ్‌లో ఉన్నా, అధికారుల కొరత సాకుతో వారిని అదే స్థానాల్లో కొనసాగించడం విస్మయానికి గురిచేస్తోంది.

పర్యవేక్షణ శూన్యం.. ఎక్కడ ఐఏఎస్ అధికారులు?
మున్సిపల్ కార్పొరేషన్ (MMC)లో ఉన్నత స్థాయి స్థానాల్లో ఐఏఎస్ అధికారులు ఉన్నప్పటికీ, కింది స్థాయిలో జరుగుతున్న ఈ బాగోతాలు వారి కంటికి ఆనకపోవడం గమనార్హం.
 
నిఘా వైఫల్యం: పన్ను వసూళ్లలో సాఫ్ట్‌వేర్ లోపాలను ఆసరాగా చేసుకుని రికార్డులను తారుమారు చేస్తున్నా ఎందుకు పసిగట్టలేకపోతున్నారు?WhatsApp Image 2026-05-10 at 20.19.21
 
విచారణలో జాప్యం:
అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, విజిలెన్స్ లేదా ఏసీబీ విచారణకు ఆదేశించకపోవడం వెనుక ఉన్న 'అదృశ్య హస్తం' ఎవరిది?

విచారణ జరపాల్సిందే!
సామాన్యుడు ఇంటి పన్ను చెల్లించకపోతే జరిమానాలు వేసే అధికారులు, కోట్లాది రూపాయల పన్ను ఎగ్గొడుతున్న బడా వ్యాపారులకు ఎందుకు వత్తాసు పలుకుతున్నారని పౌర సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి, అవినీతికి పాల్పడిన డిప్యూటీ కమిషనర్, సంబంధిత ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్‌లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఖజానాకు జరిగిన నష్టాన్ని సదరు అధికారుల నుంచే రికవరీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

About The Author