అనధికార వార్తలను పట్టించుకోవద్దు
శ్రీకోసగుండ్ల ఫణిగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రతిష్టాపకులు, ప్రధాన పూజారి కోమండూరి శేషాచారి విజ్ఞప్తి.
ఎల్బీనగర్:
శ్రీకోసగుండ్ల ఫణిగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌కు సంబంధించిన వార్తలు 11-05-2026 తేదీన కొన్ని దినపత్రికల్లో ప్రచురితమైన నేపథ్యంలో దేవస్థానం ప్రతిష్టాపకులు, ప్రధాన పూజారి కోమండూరి శేషాచారి స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ దేవస్థానం యాదాద్రి దేవస్థానం దత్తత ఆలయమని, ఆలయానికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనలు తాను గానీ, యాదాద్రి దేవస్థానం గానీ, దేవాదాయ శాఖ కమిషనర్ గానీ విడుదల చేయలేదని స్పష్టం చేశారు. ఎవరి అనుమతి లేకుండా వచ్చిన ఈ వార్తలు పూర్తిగా అనధికారికమని తెలిపారు. కాబట్టి భక్తులు, ప్రజలు ఇటువంటి వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇకముందు దేవస్థానానికి సంబంధించిన వార్తలు ప్రచురించే ముందు తప్పనిసరిగా తనను సంప్రదించాలని పత్రికా సంపాదకులకు కోరారు.
