అల్లిపూర్‌లో ఆధ్యాత్మిక వైభవం.
- శ్రీ ఆంజనేయ స్వామి ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న వంగ రాజేశ్వర్ రెడ్డి
సిద్దిపేట:
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో వంగ రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, హనుమాన్ స్వాములు ఆయనకు ఘన స్వాగతం పలికారు.వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, “జై శ్రీరామ్” నినాదాల మధ్య జరిగిన ఈ కార్యక్రమం భక్తి పారవశ్యాన్ని నింపింది. వంగ రాజేశ్వర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుంది. భక్తి భావన సమాజానికి సత్సమాజ నిర్మాణంలో దోహదపడుతుంది” అని అన్నారు.ఈ మహోత్సవంలో భక్తులు, హనుమాన్ స్వాములు, మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తుల రద్దీతో అల్లిపూర్ గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.అనంతరం కత్తెర రమేష్ రెడ్డి నివాసంలో నిర్వహించిన హనుమాన్ స్వామి భిక్ష కార్యక్రమంలో వంగ రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
