విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే మల్లేశం ప్రాణం తీసింది

  • రూ.ఐదువేలు ఆర్థిక సహాయం
  • బాధిత కుటుంబానికి అండగా వంగ రాజేశ్వర్ రెడ్డి

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే మల్లేశం ప్రాణం తీసింది

సిద్దిపేట:

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూర్‌పల్లి గ్రామానికి చెందిన పరమాల మల్లేశం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటనపై వంగ రాజేశ్వర్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా గ్రామస్తులు గత నాలుగేళ్లుగా గ్రామంలో తీవ్ర విద్యుత్ సమస్యలు కొనసాగుతున్నాయని, పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో విద్యుత్ వైర్లు, లోపభూయిష్టమైన లైన్లు ప్రజలకు ప్రాణహానిగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయం పై స్పందించిన వంగ రాజేశ్వర్ రెడ్డి సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలోని విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఇకపై ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అనంతరం బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.ఈ సందర్భంగా వంగ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ “ప్రజల ప్రాణ భద్రత విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలి” అని అన్నారు.WhatsApp Image 2026-05-10 at 20.21.28

About The Author