డ్వాక్రా రుణ పరిమితి పెంపుపై మహిళా సంఘాల హర్షం

రూ. 10 లక్షలకు పెంచడంపై సర్వత్రా స్వాగతం.. పలుచోట్ల సంబరాలు

డ్వాక్రా రుణ పరిమితి పెంపుపై మహిళా సంఘాల హర్షం

ఇబ్రహీంపట్నం:

 స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ. 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్ మెట్ మండలాల్లో ఐకేపీ ఏపీఎంలు, మహిళా సంఘాల ప్రతినిధులు శుక్రవారం సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధుల చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపారు.WhatsApp Image 2026-05-08 at 19.39.05 (1)

స్వయం ఉపాధికి మరింత ప్రోత్సాహం:

గతంలో రుణ పరిమితి రూ. 5 లక్షల వరకే ఉండటంతో పెద్ద ఎత్తున వ్యాపారాలు ప్రారంభించడానికి నిధుల కొరత ఎదురయ్యేదని మహిళలు పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పరిమితిని రెట్టింపు చేయడంతో కొత్త యూనిట్ల స్థాపనకు, స్వయం ఉపాధి రంగంలో రాణించడానికి మార్గం సుగమమైందని వెల్లడించారు. ఇప్పటికే పలు సంఘాలు ఆర్టీసీ బస్సులు, క్యాంటీన్లు, డెయిరీ ఫామ్‌లు, సోలార్ యూనిట్లను విజయవంతంగా నిర్వహిస్తున్నాయని, తాజా నిర్ణయం మహిళా సాధికారతకు మరింత ఊతమిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.WhatsApp Image 2026-05-08 at 19.39.05

About The Author

Related Posts