దివ్యాంగులకు సహాయక పరికరాలు అందజేసిన ఎంపీ కొండా విశేశ్వర్ రెడ్డి
ఎల్బీనగర్:
చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి బుధవారం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లోని జిల్లా డిసేబులిటీ సెంటర్‌కు విచ్చేసి, ఆర్టిఫిషల్ లింబ్స్ మానుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏఎల్ఐఎంసీఓ ద్వారా వికలాంగులకు సహాయక పరికరాలను అందజేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, పీఎం నరేంద్ర మోడీ దూరదృష్టి మరియు సంకల్పబలం వల్లే ఈరోజు దివ్యాంగులకు సహాయక పరికరాల పంపిణీ మాత్రమే కాకుండా, వారికి గౌరవప్రదమైన జీవనోపాధి అవకాశాలు కూడా కల్పించబడుతున్నాయి.
వివిధ ఇండస్ట్రీస్, కంపెనీలలో దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఆయన చొరవతోనే సాధ్యమైంది.“దివ్యాంగులు స్వయం సమర్థులుగా, ఆత్మ విశ్వాసంతో జీవించాలి” అనే ఆయన దృష్టి కోణం సమాజంలో సానుకూల మార్పు తీసుకువస్తోందని,ఇలాంటి గొప్ప సంకల్పంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈడి పియుష్ మిట్టల్, కందుకూరు డివిజన్ ఆర్డిఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి,డిఎంహెచ్ఓ డాక్టర్ గీత,నోడల్ ఆఫీసర్ పి. రమేష్, తహసీల్దార్ పి. వేణుగోపాల్, మాజీ కార్పొరేటర్లు ఆకుల శ్రీవాణి రాధా ధీరజ్ రెడ్డి, బీజేపీ నాయకులు అంజన్ కుమార్, కభీర్ దాస్,నర్సింహా రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
