యువతిని నమ్మించి మోసం చేసిన గణేష్ పై చర్యలు తీసుకోవాలి..
- డిఎస్పీకి వినతిపత్రాన్ని అందించిన మహిళ సంఘాలు
మణుగూరు :

మణుగూరుకు చెందిన వివాహితుడు మట్ట గణేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతిని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు మహిళ సంఘాలను ఆశ్రయించింది. శుక్రవారం మహిళ సంఘాల ఆధ్వర్యంలో బాధితురాలు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ సంఘాల నాయకురాలు మాట్లాడుతూ.. మణుగూరు మండలం, వాగు మల్లారం గ్రామంకు చెందిన మట్టా గణేష్, తండ్రి మట్టా రామారావు అనే వ్యక్తి బెంగుళూరులో యువతికి పరిచయమై ప్రేమిస్తున్నాను అనినమ్మించాడని తెలిపింది. 3 సంవత్సరాలుగా ఒకే దగ్గర పనిచేస్తూ.. బెంగుళూరులో 2 సంవత్సరాలు ఉండి 1 సంవత్సరం షేక్ పేట్లో హైదరాబాద్లో కలిసి సహజీవనం చేశామన్నారు. ఈక్రమంలో ఏదో సందర్భంలో అనుమానం కలిగి వివారాలు ఆరా తీయగా, గతంలోనే వివాహం జరిగిందని తెలిసి నిలదీయగా, మా ఆవిడకు విడాకులు ఇచ్చినని, నిన్నే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడని రోదించింది. ఈ క్రమంలో అడపదడపా నా చేతి నుండి అకౌంట్ ద్వారా రూ. 10 లక్షలు వరకు తీసుకున్నాడని తెలిపింది. వివాహం ప్రస్థావన తరచూ తెస్తుండగా అతని భార్య అయిన మట్టా రాశి శుక్రియా చేత మాట్లాడుదాం అని పిలిపించారని తెలిపారు. 2025 జులై నెల 15న వాగు మల్లారంలో తన ఇంటి వద్దకు రాగా మట్టా రాశి శుక్రియా తల్లి, గణేష్ తండ్రి దాడికి పాల్పడి హత్యాయత్నం చేసి గాయపర్చారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. మరో 2 నెలలు తరువాత కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని వాపోయింది. అంతకుముందు బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో గర్భం తీపించడం జరిగిందని తెలిపింది. నన్ను పెళ్లి చేసుకుంటానని, నమ్మించిమోసం చేసిన మట్టా గణేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించి, నాపై దాడి చేసిన మట్టా రాశిశుక్రియా, గొడుగు రమాదేవీలపై చర్యలు తీసుకోవాలని, అసభ్యంగా మాట్లాడిన మట్టా రామారావుల పై కేసు నమోదు చేయాలని మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డికి పిర్యాదు చేయడం జరిగిందని మహిళ సంఘాలు మీడియాకు తెలిపారు. ఆమెకు న్యాయం జరిగే వరకు మహిళ సంఘాలు అండగా వుంటాయని తెలిపారు. నమ్మించి మోసం చేసిన గణేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళ సంఘాలు డిమాండ్ చేశారు. లేనియెడల మహిళ సంఘాల ఆధ్వర్యంలో మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి దృష్టికి తీసుకువెళ్ళి న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనెం సరోజ, మహిళా మండలి సీనియర్ నాయకురాలు ఎండీ షబానా, కోరి శ్యామల, ఉపాధ్యక్షురాలు బొడ్డు సౌజన్య, జనరల్ సెక్రటరీ రెడ్డీబోయిన రేణుక, దేరంగుల సుజాత, కన్నాపురం వసంత, డాకూరి సౌజన్య, కన్నాపురం శైలజ, బాడిష పార్వతి, దిశ మహిళా మండలి అధ్యక్షురాలు అనిత, సఖి మహిళా మండలి భోగినేని వరలక్ష్మి, బత్తుల సుజాత, బీసీ మహిళా కమిటీ మండల అధ్యక్షురాలు కవిత , శిరీష, నర్సమ్మ, రోహిణి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
