అదనపు తరగతి గది నిర్మాణ శంకుస్థాపన
తెల్లాపూర్:
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్ ఉస్మాన్ నగర్ పరిధిలోగల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన అదనపు తరగతి గది నిర్మాణ పనులకు మంగళవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి తో కలిసి శంకుస్థాపన చేసిన పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి . గత పది సంవత్సరాలుగా ఉస్మాన్ నగర్ కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థులు పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం పట్ల అభినందనలు తెలిపారు. హాజరైన ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు..jpeg)
