చరిత్ర సృష్టించిన ఏరియా హాస్పిటల్

సూపరిండెంట్ డాక్టర్ సునీల్

మణుగూరు :

WhatsApp Image 2025-09-01 at 6.16.21 PM

మొట్ట మొదటిసారిగా ఆగష్టు నెలలో 100 కాన్పులు చేసి చరిత్ర సృష్టించిందని ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ సునీల్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఏరియా హాస్పిటల్ నందు సూపరిండెంట్ విలేకరులతో మాట్లాడుతూ 2023 సెప్టెంబర్ నెలలో 87 ప్రసవాలు జరిగాయని తెలిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇలాంటి రికార్డు చేరుకోవడానికి రెండు సంవత్సరాల కాలం పట్టిందన్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్లు లేకపోవడంతో ప్రసవాల కోసం భద్రాచలం ఏరియా హాస్పిటల్ కు తరలించేవారన్నారు. అలాంటిది నేడు ఒక్క నెలలో 100 ప్రసవాలు చేసి రికార్డు సాధించడం పట్ల ఏరియా హాస్పిటల్ వైద్య నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. దీనికి కారణం స్పెషలిస్ట్ వైద్య నిపుణుల్ని నియమించి వారికి అదనపు ఇన్సెంటివ్స్ లను అందించి ప్రోత్సహించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఏరియా హాస్పిటల్ అభివృద్ధికి వెన్నంటే ఉండి నిరంతరం ప్రోత్సహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులను ఉన్నత స్థాయిలో ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తూ ఎప్పటికప్పుడు మార్గ నిర్దేశం చేస్తున్న డిసిహెచ్ఎస్ డాక్టర్ రవి బాబులకు సూపరిండెంట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన గైనకాలజిస్ట్ వైద్యులు డాక్టర్ పద్మ, డాక్టర్ అజంతా, అనస్థసీయా డాక్టర్ ప్రసాద్ రావు, పిల్లల వైద్యులు  డాక్టర్ శ్రీదేవి,డాక్టర్ సుప్రియాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆర్.యం.ఓ జనరల్ మెడిసిన్ డాక్టర్ మార్తి సాయి మోహన్, రేడియోలాజిస్ట్ డాక్టర్ ప్రణవ్, మిడ్ వైఫ్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More మురుగు పొంగొద్దు.. నీట మునగొద్దు..

About The Author