బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ సంబరాలు
కామారెడ్డి జిల్లా :

బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మార్గదర్శకత్వంలో జిల్లావ్యాప్తంగా ప్రతిరోజు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో బతుకమ్మ పండుగలను నిర్వహించడం జరుగుతుంది. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ పండుగలో విద్య, పే అండ్ అకౌంట్స్, స్టేట్ అడిట్, ఇంటర్మీడియట్ విద్యాశాఖల ఉద్యోగులు పువ్వులతో ముస్తాబు చేసిన బతుకమ్మలతో సాంప్రదాయక దుస్తులతో హాజరై బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బతుకమ్మ ఆడి అలరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలో బతుకమ్మ పండుగకు విశిష్ట స్థానం ఉందని రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటున్న ఈ బతుకమ్మ పండుగలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
About The Author
16 Mar 2026
