ఆక్రమణల చెర నుంచి రూ.1650 కోట్ల భూమి విముక్తి.

  • ​11 ఎకరాల ప్రభుత్వ స్థలానికి హైడ్రా రక్షణ
  • కొండాపూర్, ప్రగతినగర్‌లలో ఫెన్సింగ్ ఏర్పాటు

ఆక్రమణల చెర నుంచి రూ.1650 కోట్ల భూమి విముక్తి.

హైదరాబాద్:
 నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన సుమారు 11 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా (HYDRAA) స్వాధీనం చేసుకుంది. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.1,650 కోట్లు ఉంటుందని అంచనా. స్వాధీనం చేసుకున్న స్థలాల్లో పార్కులు, స్మశాన వాటికలు, డంపింగ్ యార్డుల కోసం కేటాయించిన భూములు ఉన్నాయి. అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా ప్రాంతాల్లో ఫెన్సింగ్‌తో పాటు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది.

​కొండాపూర్‌లో పార్కు స్థలం స్వాధీనం

​శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లోని 'సెంట్రల్ పార్క్ కాలనీ' ఫేజ్-1 లేఅవుట్‌లో పార్కు కోసం కేటాయించిన రెండు ఎకరాల భూమిని హైడ్రా రక్షించింది. 1998లో 16 ఎకరాల విస్తీర్ణంలో 148 ప్లాట్లతో వెలిసిన ఈ లేఅవుట్‌లో.. సర్వే నంబరు 110/1 పరిధిలోని 2 ఎకరాలను పార్కుకు కేటాయించారు. గతంలో మున్సిపల్ అధికారులు ఇక్కడ ప్రహరీ నిర్మించినప్పటికీ, కొంతమంది ఆక్రమణదారులు దాన్ని ధ్వంసం చేసి షెడ్లు వేశారు. స్థానికులను బెదిరిస్తూ భూమిని ఆక్రమించే ప్రయత్నం చేయడంతో కాలనీవాసులు 'ప్రజావాణి'లో ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి విచారణ చేపట్టిన హైడ్రా.. మంగళవారం ఉదయం ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ వేసింది.

​ప్రగతినగర్‌లో 9 ఎకరాలకు ఫెన్సింగ్
​ప్రగతినగర్ అంబీర్ చెరువు సమీపంలో ఆక్రమణల ముప్పులో ఉన్న 9 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కూకట్‌పల్లి మండలం బాగామేరి గ్రామం సర్వే నంబరు 103లోని ఈ భూమిలో.. 5 ఎకరాలు స్మశాన వాటికకు, 4 ఎకరాలు చెత్త డంపింగ్ యార్డుకు కేటాయించినట్లు అధికారులు గుర్తించారు. చెరువును ఆనుకుని ఉన్న ఈ విలువైన భూమి కబ్జాకు గురవుతోందని వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు.. మొత్తం 9 ఎకరాల చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. అది ప్రభుత్వ స్థలమని స్పష్టం చేస్తూ బోర్డులు పాతారు.

​స్థానికుల హర్షం:
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు హైడ్రా జోక్యంతో పరిష్కారం కావడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చుట్టూ తిరిగినా సాధ్యం కాని పని, క్షేత్రస్థాయి పరిశీలనతో వేగంగా పూర్తయిందని వారు పే

About The Author