కాంగ్రెస్ తోనే గ్రామాలభివృద్ధి సాధ్యం
- బచ్చాయి పల్లి, సీతారాం పల్లి గ్రామాల్లో అభివృద్ధిపనులకు శంకుస్థాపన
- కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పూజల హరికృష్ణ
సిద్దిపేట:
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే గ్రామాల అభివృద్ధికి సాధ్యమని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ అన్నారు. సోమవారం సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని బచ్చాయిపల్లిలో జీపి భవనం,సీతారాం పల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో బచ్చాయిపల్లి నూతన గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షల రూపాయలు, డ్రైనేజీ నిర్మాణానికి 30 లక్షల రూపాయలు అలాగే సీతారాంపల్లి సిసి రోడ్డు నిర్మాణానికి 10 లక్షల రూపాయలు నిధులతో నిర్మాణాలకు భూమి పూజ చేయడం జరిగిందని అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రత్యేక నిధుల ద్వారా గ్రామాలను అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని భవిష్యత్తులో గ్రామాల మౌలిక వసతులు మరిన్ని నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుర్గం ప్రేమలత యాదగిరి, ఉప సర్పంచ్ అనుపమ, మండల శాఖ నాయకులు గుర్రం అంజిరెడ్డి, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బండి శివకుమార్, దేవిరెడ్డి రాజారెడ్డి, బాబురెడ్డి, అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు కాంగ్రెస్ నాయకులు రాజ బహదూర్ రెడ్డి,అరవింద్ గ్రామస్తులు తదితరుల పాల్గొన్నారు.
