ధర్మాజిపేట పాఠశాలకు ఆర్ఓ వాటర్ ప్లాంట్ బహుకరణ

ధర్మాజిపేట పాఠశాలకు ఆర్ఓ వాటర్ ప్లాంట్ బహుకరణ

సిద్దిపేట:

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మద్దుల గాల్ రెడ్డి ప్రోత్సాహంతో మద్దుల రాజీవ్ రెడ్డి (ఖాజీపూర్)  సహకారంతో ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ని కాంగ్రెస్ నాయకులు  మంగళవారం బహుకరించారు. ఈ సందర్బంగా దుబ్బాక మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్మేట యేసురెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో విద్యార్థుల దాహార్తిని తీర్చడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్  రెడ్డి విద్యార్థుల తరుపున దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్,  సి.ఆర్.పి. నవీన్, రాజేందర్,పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About The Author