రాబోయే స్థానిక సంస్థల్లో బీజేపీ సత్తా చాటాలి : కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 07: కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా నూతనంగా నియమించబడిన నీలం చిన్న రాజులు ప్రమాణ స్వీకార కార్యక్రమం బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఉదయం 11.44 నిమిషాలకు బీజేపీ మాజీ అధ్యక్షురాలు అరుణా తార నుండి నీలం చిన్న రాజులు జిల్లా అధ్యక్ష బాధ్యతను స్వీకరించడం జరిగింది. అనంతరం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల్లో బీజేపీ సత్తా చాటాలనీ, వార్డు సభ్యులు మొదలుకొని సర్పంచ్, ఎంపిటిసి, జడ్ పిటిసి, కౌన్సిలర్ ఇలా అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచేల ఇప్పటి నుండే పని చేయాలనీ అన్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలనీ పిలుపునిచ్చారు. పార్టీ లో పని చేసిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందనీ అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త అయితే పోటీ చేయాలి లేకపోతే పోటీ చేసిన కార్యకర్త కోసం పని చేయాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ విస్తరించి అంతట గెలిచి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీలు బీజేపీ గెలిచేలా ఇప్పటి నుండే ప్రణాళిక సిద్ధం చేయాలనీ అన్నారు.
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 07: కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా నూతనంగా నియమించబడిన నీలం చిన్న రాజులు ప్రమాణ స్వీకార కార్యక్రమం బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఉదయం 11.44 నిమిషాలకు బీజేపీ మాజీ అధ్యక్షురాలు అరుణా తార నుండి నీలం చిన్న రాజులు జిల్లా అధ్యక్ష బాధ్యతను స్వీకరించడం జరిగింది. అనంతరం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల్లో బీజేపీ సత్తా చాటాలనీ, వార్డు సభ్యులు మొదలుకొని సర్పంచ్, ఎంపిటిసి, జడ్ పిటిసి, కౌన్సిలర్ ఇలా అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచేల ఇప్పటి నుండే పని చేయాలనీ అన్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలనీ పిలుపునిచ్చారు. పార్టీ లో పని చేసిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందనీ అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త అయితే పోటీ చేయాలి లేకపోతే పోటీ చేసిన కార్యకర్త కోసం పని చేయాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ విస్తరించి అంతట గెలిచి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీలు బీజేపీ గెలిచేలా ఇప్పటి నుండే ప్రణాళిక సిద్ధం చేయాలనీ అన్నారు.
