నేడు ప్రజావాణి రద్దు
ములుగు జిల్లా :

జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23 న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లాస్థాయి అధికారులందరూ ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని మేడారం లోని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రజల సౌకర్యార్థం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లుపేర్కొన్నారు. తిరిగి వచ్చే సోమవారం సెప్టెంబర్ 29న యథావిధిగా జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
Read More అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు
About The Author
06 Dec 2025
