సర్కారు నిర్లక్ష్యంతోనే ఆర్టీసీ సమ్మె : దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్:
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మొండి వైఖరికీ నిరసనగా దిల్ సుఖ్ నగర్ సిటీ డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, మేనిఫెస్టోలో పెట్టిన ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించి, ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారహితం కారణంగానే ఉద్యోగులు సమ్మెకు దిగారన్నారు. సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని వారి కోరికలు నెరవేర్చి సమ్మె విరమించేలా చూడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ భారాస పార్టీ యువ నాయకులు సొంటి చంద్రశేఖర్ రెడ్డి, ఆర్టీసీ యూనియన్ నాయకులు, మహిళ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
