ఎల్బీనగర్ మున్సిపల్ 'జోన్'లో అక్రమాల 'డాన్'.. అధికారుల అండతో అవినీతి దండ!

  • ​జోనల్ కమిషనర్ పర్యవేక్షణ శూన్యం.. నిర్వీర్యమైన పౌర సమాచార వ్యవస్థ
  • ట్యాక్స్ నుంచి టౌన్ ప్లానింగ్ వరకు అంతా 'మాముల్లే'... ఎస్టీఎఫ్ ఊసేది?
  • అభివృద్ధి పనులు, ప్రజా సమాచారం ప్రెస్ నోట్లు రిలీజ్ చేయని దౌర్భాగ్యం..!
  • (ఎం.ఎం.సి) మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి , మున్సిపల్ కార్యదర్శి జేయేష్ రంజన్, మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సాధించాలంటూ : స్థానిక ప్రజల డిమాండ్..

ఎల్బీనగర్ మున్సిపల్ 'జోన్'లో అక్రమాల 'డాన్'.. అధికారుల అండతో అవినీతి దండ!

హైదరాబాద్:

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నుండి విడిపోయి కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసీ లో అత్యంత కీలకమైన ఎల్బీనగర్ జోన్ ఇప్పుడు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఎల్బీనగర్, సరూర్ నగర్, హయత్ నగర్, నాగోల్ వంటి నాలుగు ప్రధాన సర్కిళ్లలో పాలన పడకేసింది. సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యేనే అధికారుల వైఫల్యంపై రోడ్డెక్కి నిలదీసినా.. మీడియా సాక్షిగా అక్రమాలు బట్టబయలైనా.. ఇక్కడి అధికారుల తీరు మాత్రం 'చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు' తయారైంది. జోనల్ కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఒకే గొలుసుకట్టుగా ఏర్పడి ప్రజాధనాన్ని నిలువునా దోచుకుంటున్నారు.WhatsApp Image 2026-04-05 at 21.36.05

​ట్యాక్స్ మాఫియా: రూ. 30 లక్షల పెనాల్టీ.. రూ. 10 లక్షల లంచంతో మాయం!

​రెవెన్యూ విభాగంలో జరుగుతున్న కుంభకోణాలు విస్తుగొలుపుతున్నాయి. హయత్ నగర్ సర్కిల్ పరిధిలో నిబంధనల ప్రకారం రూ. 30 లక్షల పెనాల్టీ పడాల్సిన ఒక భారీ అసెస్మెంట్‌ను, సరూర్ నగర్ సర్కిల్ అధికారులు తమ పరిధిలోకి తీసుకుని 'సెటిల్' చేయడం గమనార్హం. కేవలం రూ. 10 లక్షల లంచం ఆశించి కొత్త అసెస్మెంట్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొట్టారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లకు తక్కువ పన్ను వేస్తూ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న ఈ 'ట్యాక్స్ సెటిల్మెంట్' వెనుక ఉన్న సూత్రధారులపై చర్యలేవి?

​టౌన్ ప్లానింగ్: పర్మిషన్ ఒకటి.. నిర్మాణం మరొకటి!
"బిల్డ్ నౌ" సాఫ్ట్వేర్ లో పారదర్శకత లేకపోవడంతో 
​టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతి కూపంలో కూరుకుపోయింది. 'నీకు ఇంత - నాకింత' అన్న చందంగా అనుమతుల జారీ సాగుతోంది.

* ​నిబంధనల ఉల్లంఘన: సరూర్ నగర్ హుడా కాంప్లెక్స్ ప్రధాన రహదారి వెంట కేవలం రెండు అనుమతులతో బహుళ అంతస్తుల భారీ కమర్షియల్ కాంప్లెక్స్ వెలుస్తున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు.

* ​రెసిడెన్షియల్ అనుమతులతో భారీ కమర్షియల్ నిర్మాణాలు : వనస్థలిపురం, బి.ఎన్.రెడ్డి నగర్ మెయిన్ రోడ్లపై నివాస గృహాల పేరుతో పర్మిషన్లు తీసుకుని, భారీ కమర్షియల్ షాపింగ్ మాల్స్ నిర్మిస్తున్నారు. సామాజిక కార్యకర్తలు ఆధారాలతో ఫిర్యాదు చేసినా 'ఫైళ్లు' కదలడం లేదంటే వసూళ్ల పర్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

​ఎంటమాలజీ విఫలం: ఎమ్మెల్యేనే నిలదీయాల్సిన దుస్థితి!
​పారిశుధ్యం పడకేయడంతో దోమల నివారణలో ఎల్బీనగర్ జోన్ పూర్తిగా చతికిలబడింది. దోమల బెడద పై స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్వయంగా అసహనం వ్యక్తం చేస్తూ అధికారుల వైఫల్యాన్ని ఎండగట్టడం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా నిరసన తెలుపడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ప్రజాప్రతినిధుల విమర్శలనే పట్టించుకోని అధికారులు, సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు.

​దిక్కులేని ఎల్బీనగర్ సర్కిల్.. గల్లీకో అక్రమ కట్టడం!

​ఎల్బీనగర్ సర్కిల్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. గత కొన్ని నెలలుగా ఇక్కడి డిప్యూటీ కమిషనర్ సెలవులో ఉండటంతో పాలన స్తంభించింది. నాథుడు లేని ఈ సర్కిల్‌లో అక్రమ నిర్మాణదారులు పండగ చేసుకుంటున్నారు. ప్రతి గల్లీలోనూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు వెలుస్తున్నా, నివారించాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

​జవాబుదారీతనం ఏది? జోనల్ కమిషనర్ మౌనం వెనుక మర్మమేమిటి?

* టీజీ బిపాస్, బిల్డ్ నౌ, మున్సిపల్ కొత్త చట్టాలు త్వరితగతిన అనుమతులు అనే విషయాన్ని మరిచి జోనల్ కమిషనర్ రోజుల తరబడి పెండింగ్లో బిల్డింగ్ ఫైల్స్..!

​జోన్ మొత్తానికి అధిపతిగా ఉండి, అన్ని విభాగాలను సమన్వయం చేయాల్సిన జోనల్ కమిషనర్ తన బాధ్యతలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

* ​నిర్వీర్యమైన ఎస్టీఎఫ్ (STF): అక్రమ కట్టడాలను అరికట్టడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడంలో జోనల్ యంత్రాంగం విఫలమైంది.

* ​ఆర్టీఐ (RTI) అపహాస్యం: సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా దాటవేయడం ఇక్కడి అధికారులకు పరిపాటిగా మారింది.

* ​మౌనమే సమాధానమా?: మీడియాలో ఆధారాలతో కథనాలు వచ్చినా, పారదర్శకతను మింగేస్తున్న అధికారులపై విచారణ జరిపించకపోవడం వెనుక పెద్ద ఎత్తున 'వాటాల' పంపిణీ జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

​ఎల్బీనగర్ జోన్ మున్సిపల్ కార్యాలయం ఇప్పుడు పౌర సేవల కేంద్రంగా కాకుండా, సెటిల్మెంట్ల కేంద్రంగా మారింది. ఉన్నతాధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక విచారణ జరిపించకపోతే, ఈ జోన్ అక్రమ నిర్మాణాలకు, అవినీతికి శాశ్వత చిరునామాగా మారడం ఖాయం. అధికారులారా.. ఇకనైనా నిద్ర మేల్కొంటారా? లేక అక్రమార్కుల అండతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూనే ఉంటారా?

About The Author