'గడ్డిమందు'ను నిషేధించండి

  • కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం... ఆమోదించిన శాసన సభ
  • భారత శక్తి వార్త కథనానికి స్పందన

'గడ్డిమందు'ను నిషేధించండి

హైదరాబాద్:

రైతులకు ప్రాణాంతకంగా పరిణ మిస్తోన్న పారాక్వాట్ డై క్లోరైడ్ (గడ్డిమందు)ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర శాసనసభ కోరింది. ఈ మేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మా నాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభలో తీర్మానం ప్రవేశపెట్టగా, ఈ తీర్మానంపై మాట్లాడిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పాల్వాయి హరీష్ బాబు, సి.హెచ్. విజయరమణారావు, రాంచంద్రు నాయక్, మురళీ నాయక్, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేల్, భూపతిరెడ్డిలు మాట్లాడుతూ, గడ్డిమందును నిషేధించాలని కేంద్రాన్ని కోరడమే కాకుండా రాష్ట్రంలో కూడా నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిషేధం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటును ఉప యోగించుకోవాలని కోరారు. పారాక్వాట్ వినియోగం కారణంగా రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, క్షణికావేశంలో దీన్ని తాగడం వల్ల జరుగుతున్న ప్రాణనష్టాలు ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని పారాక్వాట్ డైక్లోరైడ్ తయారీ, దిగుమతి, నిల్వ, రవాణా, విక్రయం, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని రాష్ట్ర అసెంబ్లీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని తీర్మానంలో మంత్రి తుమ్మల నాగేశ్వరావు పేర్కొన్నారు. కాగా, సభ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.

About The Author