ఎంఎంసీ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ లో విజిలెన్సు అధికారుల తనిఖీలు

ఎంఎంసీ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ లో విజిలెన్సు అధికారుల తనిఖీలు

ఎల్బీనగర్:

సరూర్నగర్, ఎల్బీనగర్, హయత్నగర్ సర్కిల్ కార్యాలయాలలో బుధవారం ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఎల్బీనగర్ జోన్ పరిధిలోని సర్కిల్ కార్యాలయాలలో అధికారులు, సిబ్బంది పలు అవకతవకలకు పాల్పడుతున్నారని పలువురు ఉన్నతాధికారులకు, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు చేయడంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తుంది. ఉదయం 11గంటల సమయంలో మూడు సర్కిళ్ల కార్యాలయంలో వెళ్లిన విజిలెన్స్ అధికారులు సాయంత్రం వరకు తనిఖీలు చేపట్టారు. అధికారులు ప్రధానంగా ఔట్సోర్సింగ్,కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్న ఉద్యోగుల రిజిస్టర్లను, హాజరు పట్టికలను పరిశీలించడంతో పాటు ఎంత మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు, వారు సమయానికి విధులకు హజరవుతున్నారా లేదా అనే వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం సర్కిల్ కార్యాలయలలో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు ఇంక ఎంత మంది అవసరం ఉంటుందనే వివరాలను తీసుకున్నట్లు పలువురు ఉద్యోగులు పేర్కోన్నారు. విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారనే విషయం తెలుసుకున్న పలువురు జిహెచ్ఎంసి అధికారులు ముందుగానే కార్యాలయాల నుంచి జారుకున్నట్లు కింది స్థాయి సిబ్బంది పేర్కొంటున్నారు. విజిలెన్స్ అధికారులు - టౌన్ ప్లానింగ్, శానిటేషన్, పన్నుల విభాగం, ఇతర విభాగాలలో తనిఖీలు నిర్వహించి పలు రిజిస్టర్లను స్వాధీనం చేసుకోని రిజిస్టర్లలో సంతకాలు చేయని వారందరి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనివాస్ రెడ్డి అదేశాల మేరకు అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తుంది.

About The Author