న్యాయవాదులకు ప్రొటెక్షన్ యాక్ట్ : హర్షించిన బార్ అసోసియేషన్ సభ్యులు

న్యాయవాదులకు ప్రొటెక్షన్ యాక్ట్ : హర్షించిన బార్ అసోసియేషన్ సభ్యులు

ఎల్బీనగర్:

న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు గోకుల్ రామారావు మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా న్యాయవాదులపై వివిధ రకాల దాడులు, హత్యలు, హత్యాయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు తమకు రక్షణ చట్టం కావాలని నిరంతరం పోరాటం కొనసాగించారని పేర్కొన్నారు.
న్యాయవాదుల రక్షణ చట్ట అవసరాన్ని గుర్తించిన  ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో చట్టాన్ని ప్రవేశపెట్టడం ఆనందకరమైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు విప్లవ రెడ్డి మాట్లాడుతూ, న్యాయవాదుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేర్చుతూ ప్రభుత్వం ప్రొటెక్షన్ యాక్ట్‌ను తీసుకురావడం హర్షణీయమని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నూతన ప్రధాన కార్యదర్శి వోద్యారపు రవికుమార్, ఉపాధ్యక్షుడు బొడ్డు రమేష్ కుమార్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు

About The Author