ఖాకీ సేవలకు 'గౌరవ' వందనం!

  •  ఏడుగురు పోలీసు అధికారుల పదవీ విరమణ
  • శాలువాలతో సన్మానించిన మల్కాజిగిరి సీపీ అవినాష్ మహంతి
  • హెల్త్ పట్ల కేర్ తీసుకోవాలని రిటైర్డ్ సిబ్బందికి సూచన

ఖాకీ సేవలకు 'గౌరవ' వందనం!

మల్కాజిగిరి:

పోలీసు వృత్తిలో సవాళ్లను ఎదుర్కొంటూ దశాబ్దాల పాటు క్రమశిక్షణతో సేవలు అందించిన అధికారులకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఘనంగా వీడ్కోలు పలికింది. విధి నిర్వహణలో నిబద్ధత చాటుకున్న ఏడుగురు అధికారులను సీపీ అవినాష్ మహంతి మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.

​నిరంతర పోరాటమే పోలీస్ జాబ్
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం అంటేనే ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లతో కూడుకున్నదని కొనియాడారు. ఎంతో కాలం పాటు శాఖలో సమర్థవంతంగా పనిచేసి పదవీ విరమణ పొందడం సంతోషకరమని పేర్కొన్నారు. రిటైర్మెంట్ తర్వాత విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని, కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించాలని సూచించారు.

​ఆరోగ్యంపై ఫోకస్ పెట్టండి..
రిటైర్డ్ అధికారులు తమ ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాలని, పెన్షన్ తో పాటు ఇతర ఆర్థిక అంశాల విషయంలో క్రమశిక్షణతో ఉండాలని సీపీ హితవు పలికారు. వీరికి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ త్వరగా అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆయన అక్కడికక్కడే ఆదేశించారు.

​వీడ్కోలు పొందిన వారు వీరే..
​కె. కరుణాకర్ రెడ్డి (సబ్ ఇన్స్పెక్టర్, ఘట్కేసర్)
​పి. సత్యనారాయణ చారి (రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్)
​ఎన్. జైరాం (ఏఎస్సై)
​వై. సాయిబాబా (ఏఎస్సై)
​ఏ. మూర్తుజా (ఏఎస్సై)
​కె. పద్మా రావు (హోమ్ గార్డ్ ఆఫీసర్)
​బి. బాలనర్సమ్మ (హోమ్ గార్డ్ ఆఫీసర్)

​ఈ కార్యక్రమంలో డీసీపీ (అడ్మిన్) ఇందిర, సీఏఓ శ్రీనివాస్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు భద్రా రెడ్డి, కో-ఆపరేటివ్ డైరెక్టర్ సువర్ణ, వల రాజు తదితరులు పాల్గొన్నారు.

About The Author