యువజన కాంగ్రెస్‌కు అండగా ఉంటాం: మంత్రి దామోదర్ రాజనర్సింహ
- ● ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత కల్పించాలని శివంత్ రెడ్డి వినతి.
- ● సానుకూలంగా స్పందించిన మంత్రి.
మహబూబ్‌నగర్ :
మహబూబ్‌నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహను తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి శివంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి జరుగుతున్న కృషిని మంత్రికి వివరించారు.
కార్యకర్తలకు భరోసా కల్పించాలి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో యువజన కాంగ్రెస్ సభ్యులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని శివంత్ రెడ్డి కోరారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలకు ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని, తద్వారా వారిలో నూతనోత్తేజం నింపవచ్చని విన్నవించారు. జిల్లాలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
శివంత్ రెడ్డి విజ్ఞప్తిపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. పార్టీ పటిష్టత కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, యువజన కాంగ్రెస్ నాయకత్వానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
