మూడోసారి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అంబటి బాలేష్ గౌడ్ నియామకం
సిద్దిపేట:
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా దుబ్బాక కు చెందిన అంబటి బాలేష్ గౌడ్ ను మరోసారి నియమిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు.బాలేష్ గౌడ్ ను రాష్ట్ర పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించడం ఇది మూడోసారి. గతంలో బండి సంజయ్ , తర్వాత కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న సమయంలో కూడా రెండు సార్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పని చేసారు. ప్రస్తుత బిజెపి రాష్ట్రఅధ్యక్షులు రామ్ చందర్ రావ్ కూడా మరోసారి కార్యవర్గ సభ్యులుగా నియమించారు.
ఆర్ఎస్ఎస్ నుండి ఏబీవీపీ లో చురుగ్గా....
26 ఏళ్లుగా పార్టీలో బాధ్యతలు...
బాలేష్ గౌడ్ కు మంచి పేరుంది.
శక్తి వంచనలేకుండా కృషి చేస్తా
- మూడోసారి నియమించడం సంతోషకరం
- పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు
- రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్
తనపై నమ్మకంతో మూడోసారి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావ్ నియమించడం పట్ల అంబటి బాలేష్ గౌడ్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటు పడతానని తెలిపారు.రాబోయే 2028 ఎన్నికలలో తెలంగాణా రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకు శక్తివంచన లేకుండా పని చేస్తానని అన్నారు. తనని నియమించిన రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావ్ కి ఈ సందర్బంగా తాను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
