బీజేపీ అక్రమాలను తరిమికొడదాం..
యువజన కాంగ్రెస్ శ్రేణులకు శివంత్ రెడ్డి పిలుపు
మహబూబ్‌నగర్:
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ఎండగట్టాలని, రాబోయే రోజుల్లో యువజన కాంగ్రెస్‌ను గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇంచార్జ్ శివంత్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
పల్లె పల్లెనా పార్టీ బలోపేతం:
ఈ సందర్భంగా శివంత్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో యువజన కాంగ్రెస్ కార్యకలాపాలను మరింత ఉధృతం చేయాలని సూచించారు. ముఖ్యంగా మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలను వేసి పార్టీని పటిష్టం చేయాలన్నారు. కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై యువత పోరాడాలని, బీజేపీ అక్రమాలను తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
జిల్లా కార్యవర్గ సమావేశానికి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అవేజ్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు. వారితో పాటు వివిధ నియోజకవర్గ, మండలాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు మరియు యువజన కార్యకర్తలు పాల్గొన్నారు.
