ఏఎస్ ఐ శంకర్రావు, చాడ శ్రీనివాస్ సేవలు అభినందనీయం

  • పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘన వీడ్కోలు
  • పోలీస్ విభాగానికి అందించిన సేవలను ఎప్పటికీ మరవలేం
  • పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఐపిఎస్

ఏఎస్ ఐ శంకర్రావు, చాడ శ్రీనివాస్ సేవలు అభినందనీయం

సిద్దిపేట:

పోలీస్ శాఖలో అంకితభావంతో పనిచేసిన ఏఎస్ ఐ శంకర్రావు, చాడ శ్రీనివాస్ సేవలు అభినందనీయమని 
పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఐపిఎస్  అన్నారు.మంగళవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.సుదీర్ఘకాలంగా పోలీస్ శాఖలో సేవలందిస్తూ పదవీ విరమణ పొందిన వారిలో సింగీతం శంకర్ రావు , అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ASI), బెజ్జంకి పోలీస్ స్టేషన్ – కానిస్టేబుల్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి, హెడ్ కానిస్టేబుల్, అనంతరం ఏఎస్ఐగా అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ సేవలందించారు.చాడ శ్రీనివాస్ సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ – కానిస్టేబుల్‌గా ప్రారంభించి హెడ్ కానిస్టేబుల్ స్థాయికి ఎదిగి విధులు నిర్వర్తించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఐపిఎస్  పదవీ విరమణ పొందిన అధికారులను అభినందించి, సన్మాన పత్రం, మెమెంటో అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో అంకితభావంతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని పొందిన వీరి సేవలు ఆదర్శప్రాయమని ప్రశంసించారు. సిద్దిపేట పోలీస్ విభాగానికి వారు అందించిన సేవలను ఎప్పటికీ మరవలేమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా పోలీస్ కుటుంబ సభ్యులుగానే కొనసాగుతారని, ఎలాంటి సమస్య వచ్చినా తమను సంప్రదించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్ & లా అండ్ ఆర్డర్) కుశాల్కర్ , రాష్ట్ర పోలీస్ సంఘం ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-03-31 at 19.49.01 (1)WhatsApp Image 2026-03-31 at 19.49.00

About The Author