బాలాపూర్‌లో ఘనంగా హనుమాన్ జయంతి
ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన పారిజాత నర్సింహారెడ్డి
బాలాపూర్:
మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ డివిజన్ పరిధిలో హనుమాన్ జయంతి వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా డివిజన్‌లోని పలు హనుమాన్ దేవాలయాల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో వేడుకలు:
బాలాపూర్ ప్రాంతంలోని వివిధ వీధుల్లో వెలసిన ఆంజనేయ స్వామి ఆలయాలను పారిజాత నర్సింహారెడ్డి సందర్శించారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, బాలింగని జంగయ్య, పగడాల ఉమేష్ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు హనుమన్నామ స్మరణతో మారుమోగాయి.
