మల్కాజిగిరి బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా విశిష్ట సేవలు: అడ్వకేట్ సాయి సౌరిష్ రావుకు సత్కారం

మల్కాజిగిరి బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా విశిష్ట సేవలు: అడ్వకేట్ సాయి సౌరిష్ రావుకు సత్కారం

కాప్రా:

మల్కాజిగిరి బార్ అసోసియేషన్ తరఫున అడ్వకేట్ జి. సాయి సౌరిష్ రావు గారికి ప్రశంసాపత్రం (అప్ప్రెసియేషన్ అవార్డు) ప్రదానం చేయడం జరిగింది. అసోసియేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఆయన అందించిన నిబద్ధతతో కూడిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేశారు.
న్యాయవృత్తి పట్ల అంకితభావంతో పాటు, సంఘ అభివృద్ధికి ఆయన చేసిన కృషి విశేషమని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం, సమస్యల పరిష్కారం, సంఘ ఐక్యత పెంపొందింపులో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. యువ న్యాయవాదులకు మార్గదర్శకత్వం వహిస్తూ, సంఘ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఆయన చూపిన నాయకత్వం ప్రశంసనీయం అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గౌరవనీయ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీ తిరుపతి గారు అవార్డును ప్రదానం చేసి, అడ్వకేట్ సాయి సౌరిష్ రావు గారి సేవలను అభినందించారు. న్యాయరంగంలో ఆయన మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ అవార్డు ఆయన సేవలకు లభించిన గౌరవప్రదమైన గుర్తింపుగా నిలుస్తుందని, భవిష్యత్తులో కూడా ఇలాగే సేవలు కొనసాగించాలని అసోసియేషన్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

About The Author