రేపే హనుమాన్ శోభాయాత్ర.. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు!

  • ​మల్కాజిగిరి వైపు వెళ్తున్నారా? అయితే ఇది చదవండి..
  • ​తడ్బండ్ వైపు వాహనాలు బంద్.. ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని పోలీసుల సూచన

రేపే హనుమాన్ శోభాయాత్ర.. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు!

​మల్కాజ్గిరి:

హనుమాన్ జయంతి వేడుకలకు నగరం ముస్తాబైంది. గురువారం (ఏప్రిల్ 2న) నిర్వహించనున్న ‘శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర’ దృష్ట్యా మల్కాజిగిరి పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా స్పెషల్ ప్లాన్ వేశారు.

​12 కిలోమీటర్ల మేర యాత్ర..
​ఈ భారీ శోభాయాత్ర ఉదయం 11:30 గంటలకు గౌలిగూడ రామ్ మందిర్ నుంచి మొదలై.. రాత్రి 8 గంటలకు తడ్బండ్ హనుమాన్ టెంపుల్‌కు చేరుకుంటుంది.

​రూట్ మ్యాప్: మొత్తం 12 కిలోమీటర్ల యాత్రలో 2 కిలోమీటర్ల మేర మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో సాగుతుంది.

​ఉప యాత్రలు: కర్మన్‌ఘాట్ సహా వివిధ ఏరియాల నుంచి మరో 14 చిన్న యాత్రలు మెయిన్ ర్యాలీలో కలుస్తాయి.
​లోకల్ సందడి: ఇవి కాకుండా కమిషనరేట్ వ్యాప్తంగా మరో 92 లోకల్ ఊరేగింపులు జరగనున్నాయి.WhatsApp Image 2026-04-01 at 20.03.53

​ఈ రూట్లలో పోతే ట్రాఫిక్ కష్టాలే!
​యాత్ర సాగే సమయంలో కింది ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ ఉండే ఛాన్స్ ఉంది:
​ముఖ్య ప్రాంతాలు: CTO - తడ్బండ్, ఆనంద్‌బాగ్, సఫిల్‌గూడ, నేరెడ్‌మెట్, ఈసీఐఎల్, ఏఎస్ రావు నగర్, సైనిక్‌పురి, యాప్రాల్, హస్మత్‌పేట్, తార్నాక, హబ్సిగూడ, ఎల్బీ నగర్.

​నో పార్కింగ్.. నో ఎంట్రీ..
​యాత్ర జరిగే రూట్లలో రోడ్లపై బండ్లు ఆపితే టోయింగ్ చేస్తారు.

​భారీ వాహనాలు: ఆర్టీసీ బస్సులు, లారీలు, సరుకు రవాణా వాహనాలకు అనుమతి లేదు. వేరే రూట్లలోకి మళ్లిస్తారు.

​భక్తుల కోసం పార్కింగ్ ఇక్కడే.. (తడ్బండ్ వద్ద)
​బైకులు: ధోబీ ఘాట్ దగ్గర పార్క్ చేయాలి.
​కార్లు: హనుమంత రెడ్డి కాంప్లెక్స్ (తడ్బండ్ ఎక్స్ రోడ్స్).
​బస్సులు: కార్ఖానాలోని ఇంపీరియల్ గార్డెన్స్ ముందున్న గ్రౌండ్.

​అలెర్ట్: ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని డీసీపీ (ట్రాఫిక్) కోరారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 112 లేదా మల్కాజిగిరి ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్లు 8712662999, 8712662850 కు కాల్ చేయొచ్చు.

About The Author