ఖమ్మం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 08: ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో అత్యవసర చికిత్స పొందిన పేదలను ఆదుకునేందుకు ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి సిఫారసుతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను.. ఎంపీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా నేత కొప్పుల చంద్రశేఖర్ శనివారం పంపిణీ చేశారు. సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలకు సంబంధించి పలువురికి రూ.1.10 లక్షల విలువచేసే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎంపీ సిఫారసుతో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ ఓసీలు వేగంగా మంజూరు అవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్నాతండా మాజీ సర్పంచ్ బానోత్ పాపా నాయక్, నాయకులు మాజీద్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 08:

ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో అత్యవసర చికిత్స పొందిన పేదలను ఆదుకునేందుకు ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి సిఫారసుతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను.. ఎంపీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా నేత కొప్పుల చంద్రశేఖర్ శనివారం పంపిణీ చేశారు. సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలకు సంబంధించి పలువురికి రూ.1.10 లక్షల విలువచేసే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎంపీ సిఫారసుతో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ ఓసీలు వేగంగా మంజూరు అవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్నాతండా మాజీ సర్పంచ్ బానోత్ పాపా నాయక్, నాయకులు మాజీద్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

About The Author