సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది:- చిలుక మధుర ఉపేందర్ రెడ్డి

సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది:- చిలుక మధుర ఉపేందర్ రెడ్డి

ఎల్బీనగర్:

మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ పరిధిలోని కొత్తపేట వాసవి కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన కళ్యాణ లక్ష్మీ చెక్కును సంబంధిత లబ్ధిదారులు వాసవి కాలనీవాసులు మాలే శ్రీనివాస్ గుప్తాకి అందజేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చిలుక మధుర ఉపేందర్ రెడ్డి. ఈ సందర్భంగా మధుర ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ, రాష్ట్ర అభివృద్ధికి మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే అనేక ప్రజా ప్రయోజనకరమైన పనులను చేపట్టిందని వారు తెలిపారు. ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం (మహాలక్ష్మీ పథకం), గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించే వైద్య సేవలను 10 లక్షల రూపాయల పెంపు, పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ, సన్న వడ్లపై బోనస్ అందిస్తూ, కటింగ్ లేకుండా ధ్యానం కొనుగోలు అలాగే హైదరాబాద్ నగరాన్ని ప్రత్యేక ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తూ ఎన్నో హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని వారు వివరించారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు పెద్దవూర సైదులు, విప్లవ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author