బ్రాహ్మణపల్లిలో వైభవంగా వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం

  • ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి
  • సంస్కృతి, సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట: మల్రెడ్డి.

బ్రాహ్మణపల్లిలో వైభవంగా వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం

అబ్దుల్లాపూర్‌మెట్:

మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం ఆదివారం ఆధ్యాత్మిక శోభతో కన్నులపండువగా సాగింది. ఈ వేడుకలకు ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న రంగారెడ్డికి ఉత్సవ నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించి, స్వాగతం పలికారు.WhatsApp Image 2026-05-24 at 18.08.37

*కనులపండువగా కల్యాణ ఘట్టం,
అనంతరం రంగారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి కొలువుదీరి స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని, గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఆ వేణుగోపాలస్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.
*ఆలయాల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు

"రాష్ట్ర ప్రభుత్వం ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాల పునరుద్ధరణకు, ధూపదీప నైవేద్యాలకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తోంది."
    మల్రెడ్డి రంగారెడ్డి, శాసనసభ్యుడు

ఈ కల్యాణోత్సవ వేడుకల్లో గ్రామ ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది.WhatsApp Image 2026-05-24 at 18.08.36

About The Author