ఎస్‌ఎన్‌డీపీ నాలా పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సబితా ఇంద్రారెడ్డి

ఎస్‌ఎన్‌డీపీ నాలా పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సబితా ఇంద్రారెడ్డి

ఎల్బీనగర్:

మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం డివిజన్లో విజయపురి కాలనీలో పర్యటించిన మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి  ఎస్‌ఎన్‌డీపీ నాలాల నిర్మాణ పనులు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయని ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేశారు. కాలువల పనులు పూర్తికాకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు, ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందన్నారు. ఇప్పటికే వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని అధికారులను కోరారు. మధ్యలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించి, వర్షాల సమయంలో నగరం మునిగిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నగరాభివృద్ధి దృష్ట్యా మంచి ఆలోచనతో ఎస్‌ఎన్‌డీపీ నాలాల ప్రాజెక్టును ప్రారంభించారని, అయితే ప్రస్తుతం పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. దాదాపు రెండు సంవత్సరాలుగా పనులు కొనసాగుతున్నప్పటికీ ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్నారు.అలాగే నగరంలో చెత్త సమస్య, తాగునీటి ఇబ్బందులు కూడా తీవ్రమవుతున్నాయని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మున్సిపల్ శాఖ అధికారులు బాధ్యతగా పనిచేసి చెత్త తొలగింపు, కాలువల శుభ్రత, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.వర్షాకాలానికి ముందే అన్ని డ్రైనేజీ, నాలాల పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అలాగే నగరంలోని మూడు కార్పొరేషన్లకు స్పష్టమైన బాధ్యతలు కేటాయించి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి సరూర్ నగర్ డిప్యూటీ కమీషనర్ బోనగిరి శ్రీనివాస్, ఈఈ కార్తీక్, డిఈ విజయ్ కుమార్,చందన,ఏఈ ప్రశాంతి ఆర్కే పురం డివిజన్, సరూర్నగర్ డివిజన్, ఎన్టీఆర్ నగర్ డివిజన్ చెందిన భారాస పార్టీ నాయకులు, విజయపురి కాలనీ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-05-19 at 18.13.40 (1)

About The Author