స్టేట్ మొదటి ర్యాంక్ సాధించిన ఋషిని ఘనంగా సన్మానించిన రెడ్డి సంఘాల ప్రతినిధులు

40 ఏండ్ల చరిత్రలో మొదటి సారి మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థిణి

స్టేట్ మొదటి ర్యాంక్ సాధించిన ఋషిని ఘనంగా సన్మానించిన రెడ్డి సంఘాల ప్రతినిధులు

ఎల్బీనగర్

కృషీ, పట్టుదల, లక్ష్యం ఉంటే విజయం తప్పదని నిరూపించిన రెడ్డి బిడ్డకు దక్కిన అరుదైన గౌరవం.40 ఏండ్ల ఎంసెట్ ( ఎప్ సెట్ ) చరిత్రలో మొదటి సారి మొదటి ర్యాంక్ సాధించి, ఎవరికీ రాని మార్కులను పొందిన రెడ్డి జాతీ ఆణిముత్యపు బిడ్డ ఋషి. మొన్న జరిగిన తెలంగాణ ఎప్ సెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మల్లాడి ఋషిని ఆదివారం చంపాపేటలోని తెలంగాణ రెడ్డి సంఘం కేంద్ర కార్యాలయం  తెలంగాణ రెడ్డి సంఘం అడ్ హక్ కమిటీ  చైర్మన్ బద్దూరి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మల్లాడి ఋషికి సన్మానపత్రంతో పాటు అమ్మాయిని శాలువాతో సత్కరించి, 1,43,000/- రూపాయల చెక్కులను రెడ్డి సంఘం తరపున పెద్దలందరు కలసి అందించడం జరిగింది. తదుపరి వివిధ జిల్లాల నుండి విచ్చేసిన రెడ్డి ప్రతినిధులు కూడా అమ్మాయిని సన్మానించి, అన్ని రకాలుగా తమ వంతు సహాయాన్ని అందిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి రెడ్డి సంఘం ఫౌండర్ నావల్గ సత్యనారాయణ రెడ్డి, బొక్క భూపాల్ రెడ్డి, పిట్ట శ్రీనివాస్ రెడ్డి, కొట్టం మధుసూదన్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, ఎలిమినేటి సుమన్ రెడ్డి, ఎన్నెపల్లి లింగారెడ్డి, సూదిని దేవేందర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, పిన్నింటి రణధీర్ రెడ్డి, అంపజ్వాల శ్రీధర్ రెడ్డి, సతీష్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రెడ్డి గర్జన పాపిరెడ్డి, రవీందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, మణికొండ రెడ్డి ఫౌండేషన్ ప్రతినిధులు, పోచంపల్లి రెడ్డి సంఘం ప్రతినిధులు, గంగుల శ్రీలత రెడ్డి, దేవిరెడ్డి విజితా రెడ్డి, నూకల పద్మారెడ్డి, నందికొండ గీతారెడ్డి, సరితా రెడ్డి, సంధ్యారెడ్డి, లహరి రెడ్డి, లతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author