రైతులకు రుణమార్పిడి పథకం పై రైతులకు అవగాహన

మహబూబాబాద్ :
చెన్నామల్లారెడ్డి మాట్లాడుతూ, ఋణమార్పిడి పథకం ద్వారా రైతులు ప్రైవేట్ దళారీల అధిక వడ్డీ రుణాల నుండి బయటపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత రుణాలను తక్కువ వడ్డీతో ఉన్న బ్యాంకు రుణాల్లోకి మార్చుకోవడం, రైతులకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు. రుణ మార్పిడి ప్రక్రియలో పత్రాల ప్రాముఖ్యత, బ్యాంకులతో నేరుగా మాట్లాడాల్సిన అవసరం, మధ్యవర్తులపైన ఆధారపడకూడదన్న విషయాల్లో రైతులకు సూచనలు ఇచ్చారు. రైతులకు అధిక రుణ భారానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించవచ్చని తెలియజేశారు. సమావేశం అనంతరం పలువురు రైతులు ఋణమార్పిడి పథకం గురించి స్పష్టమైన అవగాహన కలిగిందని, దీనివల్ల రుణ భారాన్ని తగ్గించుకునే నమ్మకం కలిగిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సెక్రటరీ రమేష్ పాల్గొన్నారు.
Read More నేటి భారతం :
About The Author
06 Dec 2025
