ఉప్పల్‌లో నేడే క్రికెట్‌ సమరం.. ట్రాఫిక్‌ ఆంక్షలు జారీ!

ఉప్పల్‌లో నేడే క్రికెట్‌ సమరం.. ట్రాఫిక్‌ ఆంక్షలు జారీ!

హైదరాబాద్‌: 

ఐపీఎల్‌-2026 సీజన్‌లో భాగంగా ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నేడు (మే 22) సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ మధ్య ఉత్కంఠ పోరు జరగనుంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 గంటల వరకు ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని మల్కాజ్‌గిరి డీసీపీ వెల్లడించారు.

*భారీ వాహనాలపై ఆంక్షలు
లారీలు, ట్రక్కులు, ప్రైవేట్ బస్సులు తదితర భారీ వాహనాలను ఉప్పల్ వైపు అనుమతించరు. ఘట్‌కేసర్ నుంచి వచ్చేవారు ఉప్పల్ భగ్యాత్ మీదుగా, ఎల్.బీ. నగర్ నుంచి వచ్చేవారు నాగోల్ మీదుగా మళ్లిస్తారు. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వెళ్లేవారు సర్వే ఆఫ్ ఇండియా, బీరప్పగడ్డ మీదుగా వెళ్లాలని సూచించారు. సొంత వాహనాల కంటే మెట్రో, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని కోరారు.

*పార్కింగ్ మరియు ప్రేక్షకుల కోసం సూచనలు
స్టేడియం వద్ద పెంగ్విన్, టీజీ ఐఏఎల్ఏ, డీఎస్ఎల్ ఓపెన్ ప్లేస్, మోడర్న్ బేకరీ వద్ద సాధారణ వాహనదారుల కోసం పార్కింగ్ కేటాయించారు. వీఐపీలు మాత్రమే గేట్ 1A ద్వారా లోపలికి వెళ్లాలి. ప్రేక్షకులు మ్యాచ్‌కు గంట ముందే చేరుకుని, గేట్ల కోసం గూగుల్ మ్యాప్స్ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని పోలీసులు కోరారు. టికెట్ల విషయంలో నకిలీ వెబ్‌సైట్లతో జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే 100కు డయల్ చేయాలని సూచించారు.

About The Author