మన సంస్కృతి, నదీ జీవన విధానం ప్రపంచానికే ఆదర్శం

  • * సరస్వతీ అంత్య పుష్కరాల ప్రారంభోత్సవంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి.
  • * మంత్రులు శ్రీధర్‌ బాబు, కొండా సురేఖలతో కలిసి ప్రత్యేక పూజలు
  • *ప్రారంభించిన కంచి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి

మన సంస్కృతి, నదీ జీవన విధానం ప్రపంచానికే ఆదర్శం

*హైదరాబాద్:

‘‘మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, నదీ జీవన విధానం ప్రపంచానికే ఆదర్శం. పవిత్రమైన నదీ పుష్కరాలు ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తాయి’’ అని ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు (ఎమ్మెల్యే) మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నాడు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన సరస్వతీ నది అంత్య పుష్కరాల ప్రారంభోత్సవ వేడుకలకు ఆయన రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు, కొండా సురేఖలతో కలిసి హాజరయ్యాడు. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ పవిత్ర పుష్కరాలను శాస్త్రోక్తంగా ప్రారంభించాడు.WhatsApp Image 2026-05-21 at 19.53.59

*జ్ఞానానికి, విద్యకు అధిదేవత ‘సరస్వతి’
ఈ సందర్భంగా మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ... చదువుల తల్లి సరస్వతి దేవి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా విలసిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపాడు. భారతీయ సాంప్రదాయంలో సరస్వతీ నదికి అత్యంత ఉన్నతమైన స్థానం ఉందని గుర్తుచేశాడు. జ్ఞానానికి, విద్యకు అధిదేవత అయిన సరస్వతీ అమ్మవారి అంత్య పుష్కరాల ప్రారంభ దినాన నదిని దర్శించుకోవడం, పూజలు నిర్వహించడం ఎంతో పుణ్యఫలమని స్పష్టం చేశాడు. ఈ పవిత్ర రోజుల్లో నదీ స్నానం ఆచరించడం వల్ల మానసిక ప్రశాంతత, పుణ్యగతులు సిద్ధిస్తాయని ఆయన పుష్కరాల ఆధ్యాత్మిక ప్రాధాన్యతను వివరించాడు.

*కాళేశ్వర ముక్తీశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుష్కరాల ప్రారంభాన్ని పురస్కరించుకుని నదీ తీరాన ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుల వేదమంత్రోచ్చారణల నడుమ నదికి అర్ఘ్యప్రదానం చేసి, కర్పూర హారతులు ఇచ్చారు. 
లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ జరిగిన ఈ మహత్తర పూజా కార్యక్రమాల్లో మల్‌రెడ్డి రంగారెడ్డి, మంత్రులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-05-21 at 19.53.58 (2)

*ప్రజలందరూ బాగుండాలనేదే నా తపన..
‘‘రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో చదువుల తల్లి జ్ఞానజ్యోతులు నింపాలి. రైతాంగం చల్లగా ఉండాలి. ప్రతి ఇల్లూ పాడిపంటలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. ప్రజలందరూ బాగుండాలనేదే నా నిరంతర తపన.’’
  *మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యేWhatsApp Image 2026-05-21 at 19.53.58 (1)

About The Author