కోర్టు భవనాల నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి: హైకోర్టు న్యాయమూర్తి సుజన.
ఆదిలాబాద్:
నూతన కోర్టు భవనాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి సుజన అన్నారు. ఆదివారం సారంగాపూర్ మండలం చించోలి. బి గ్రామ సమీపంలో పలు కోర్టుల భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు సుజన, లక్ష్మణ్, నర్సింగ్ రావు, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ లు పాల్గొన్నారు.
ముందుగా కోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేశారు. శిలాఫలకాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా న్యాయమూర్తి సుజన మాట్లాడుతూ, జిల్లాలో నూతన కోర్టు భవనాలకు భూమి పూజ చేయడం సంతోషకరమైన విషయమని వివరించారు. కోర్టు భవనాలను త్వరితగతిన పూర్తి చేసి న్యాయ సేవలకు వినియోగంలోనికి తీసుకురావాలని పేర్కొన్నారు.
నూతన కోర్టు భవనాలకు అనువైన స్థలం కేటాయించడం గొప్ప విషయం:హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్.
జిల్లాలో నూతన కోర్టు భవనాల నిర్మాణానికి చక్కని చదునైన స్థలాన్ని అధికారులు కేటాయించడం ఎంతో సంతోషకరమైన విషయమని వివరించారు. కోర్టులను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు త్వరితగతిన న్యాయ సేవలు అందించడం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. కోర్టు భవనాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు.
కోర్టుల ఆధునీకరణ ద్వారా న్యాయ సేవలో వేగం పెరుగుతుంది:హైకోర్టు న్యాయమూర్తి నర్సింగ్ రావు.
నూతన కోర్టు భవనాల నిర్మాణంతో ప్రజలకు లాభం చేకూరుతుంది:జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
నూతన జిల్లా కోర్టు భవనాల నిర్మాణంతో ప్రజలకు న్యాయవాదులకు ఎంతో లాభం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. చించోలి.బి గ్రామ సమీపంలో నూతన కోర్టు భవనాలను నిర్మించుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం అని అన్నారు. ప్రధాన న్యాయస్థానం పాటు, సీనియర్ జూనియర్ సివిల్ సెషన్స్ పోక్సో, ఎస్సీ, ఎస్టీ, ఫ్యామిలీ న్యాయస్థానాలతో సహా మొత్తం 12 కోర్టు భవనాలను నిర్మించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కోర్టు భవన నిర్మాణాలు అందుబాటులోకి వస్తే ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని పేర్కొన్నారు. ప్రజలతోపాటు న్యాయమూర్తులకు, కోర్టు అధికారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. కోర్టు భవనాల నిర్మాణ పనులు నిర్ణిత గడువులోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, ఎస్పీ జానకి షర్మిలలు మాట్లాడుతూ, నూతన భవనాల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపనలు చేయడానికి హైకోర్టు న్యాయమూర్తులు జిల్లాకు రావడం సంతోషకరమైన విషయమని తెలిపారు. నూతన న్యాయస్థానాల భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తి కావాలని ఆకాక్షించారు.
కార్యక్రమానికి హాజరైన న్యాయమూర్తులు, కలెక్టర్ ను శాలువాలతో సన్మానించి, వారికి జ్ఞాపికలు అందజేశారు
అంతకుముందు జిల్లా కేంద్రానికి చేరుకున్న న్యాయమూర్తులకు, అటవీ శాఖ వసతిగృహంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు సాయికుమార్, ఉపేందర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి, ఇతర అధికారులు, కోర్టు అధికారులు, న్యాయమూర్తులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
