పెట్రోల్, డిజిల్ ధరల పెరుగుదలపై ఎల్బీనగర్ చౌరస్తాలో బిఆర్ఎస్ నిరసన జ్వాల
ఎల్బీనగర్:
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిపై మోపుతున్న పెట్రో భారాన్ని నిరసిస్తూ నేడు ఎల్బీనగర్ చౌరస్తా హోరెత్తింది.ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నేతృత్వంలో, గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ పార్టీ శ్రేణులతో కలిసి ప్లకార్డులు పట్టుకొని భారీ నిరసన చేపట్టారు.నిరసన అనంతరం మీడియాతో మాట్లాడుతూ..పెట్రోల్, డిజిల్ ధరలను ఒక్కసారిగా ₹110 దాటించి సామాన్యుడి నడ్డి విరవడం దుర్మార్గమని మండిపడ్డారు.ముడి చమురు ధర తక్కువ ఉన్నప్పుడు ధరలు తగ్గించి సామాన్య ప్రజలకు భారం తగ్గించలేదు, అలాగే నేడు ముడిచముడు ధర పెరిగిందని ప్రజల మీద భారం వేయడం ప్రజా వ్యతిరేకం...కేంద్రం సెస్సుల పేరుతో, రాష్ట్రం వ్యాట్ (VAT) పేరుతో ప్రజల రక్తాన్ని తాగుతున్నాయని ధ్వజమెత్తారు.పొరుగు రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉన్నా, మన వద్ద తగ్గించకపోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యమేనని ఎండగట్టారు.తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, లేదంటే ప్రజలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం డివిజన్ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
