
తపాల శాఖ 2025 -26 సంవత్సరానికి గాను దీన్ దయాళ్ స్పర్శ్ పథకానికి గాను 6 వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల నుండి ఫిలాటెలి స్కాలర్షిప్ కొరకు దరఖాస్తులు ఆహ్వానించుచున్నామని సంగారెడ్డి పోస్టల్ డివిజన్ ఎస్పీ డి. శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థిని విద్యార్థులు నిర్ణీత ఫార్మేట్లో వచ్చేనెల 13 వరకు సంగారెడ్డి డివిజన్ ఆఫీస్ కు దరఖాస్తు చేసుకోవాలని పోస్టల్ ఎస్పీ సూచించారు.
దీనిలో భాగంగా ప్రతి తరగతిలో 10 మందికి స్కాలర్షిప్ అందిస్తామని అన్నారు. ప్రతి అవార్డు గ్రహీత కు సంవత్సరం మొత్తానికి 6000 వేల రూపాయలు చెల్లించబడుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఫిలాటెలి పట్ల ఆసక్తిని పెంపొందించడం కోసం తపాల శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ స్పర్శ్ యోజన ఫిలాటేలి స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టిందని దీనిని సంగారెడ్డి జిల్లా పరిధిలోని పాఠశాలల విద్యార్థులు సద్వినియోగపరుచుకొని లబ్ధి పొందాలని ఎస్పి కోరారు.