కేంద్ర బడ్జెట్ అంకెల గారడి, బడ్జెట్ తో పేదలకు నష్టమే: సీపీఎం నగర కార్యదర్శి గుడికందుల

కరీంనగర్, జనవరి 1(భారత శక్తి): కేంద్ర ప్రభుత్వం 2025-2026 సంవత్సరానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడిగా ఉందని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం విమర్శించారు. ఈ సందర్బంగా ఆయన ఒక ప్రకటనలో వివరాలు తెలియజేశారు. ఆదాయపు పన్ను 12 లక్షల వరకు మినహాయింపు, మధ్యతరగతి ప్రజలను, వేతన జీవులను మభ్యపెట్టడానికే అని ఆరోపించారు. వాస్తవంగా 12 లక్షలు ఆదాయపు పన్ను పేరుతో 5శాతం వసూలు చేస్తున్నారని, వ్యవసాయ రంగానికి, విద్య, వైద్యానికి మొండి చేయి చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ పేదలకు, ఉపాధి కార్మికులకు, కష్టజీవులకు బడ్జెట్ లో ఒరిగిందేమీ లేదని విమర్శించారు. పెట్రోల్ డీజిల్, ధరలపై జీఎస్టీ విధించకుండా అదనంగా పెద మధ్య తరగతి ప్రజలను కేంద్ర ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాలు, పల్లెలు, వ్యవసాయం, విద్య, వైద్యానికి అధిక నిధులు కేటాయించినప్పుడే దేశం అభివృద్ధి పథం వైపు దూసుకెళ్తుందని గుర్తుచేశారు. సంపన్నులకు, పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు ఉందని, రాబోయే రోజుల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో పెద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనీ సత్యం ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర బడ్జెట్ అంకెల గారడి, బడ్జెట్ తో పేదలకు నష్టమే: సీపీఎం నగర కార్యదర్శి గుడికందుల

కరీంనగర్, జనవరి 1(భారత శక్తి):
కేంద్ర ప్రభుత్వం 2025-2026 సంవత్సరానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడిగా ఉందని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం విమర్శించారు. ఈ సందర్బంగా ఆయన ఒక ప్రకటనలో వివరాలు తెలియజేశారు. ఆదాయపు పన్ను 12 లక్షల వరకు మినహాయింపు, మధ్యతరగతి ప్రజలను, వేతన జీవులను మభ్యపెట్టడానికే అని ఆరోపించారు. వాస్తవంగా 12 లక్షలు ఆదాయపు పన్ను పేరుతో 5శాతం వసూలు చేస్తున్నారని, వ్యవసాయ రంగానికి, విద్య, వైద్యానికి మొండి చేయి చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ పేదలకు, ఉపాధి కార్మికులకు, కష్టజీవులకు బడ్జెట్ లో ఒరిగిందేమీ లేదని విమర్శించారు. పెట్రోల్ డీజిల్, ధరలపై జీఎస్టీ విధించకుండా అదనంగా పెద మధ్య తరగతి ప్రజలను కేంద్ర ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు.
గ్రామీణ ప్రాంతాలు, పల్లెలు, వ్యవసాయం, విద్య, వైద్యానికి అధిక నిధులు కేటాయించినప్పుడే దేశం అభివృద్ధి పథం వైపు దూసుకెళ్తుందని గుర్తుచేశారు.
సంపన్నులకు, పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు ఉందని, రాబోయే రోజుల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో పెద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనీ సత్యం ఆవేదన వ్యక్తం చేశారు.

About The Author