నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 13: ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి మున్నేరు నదీ పరివాహక ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంచికంటి నగర్, బొక్కలగడ్డ మున్నేరు నదీ ప్రాంతంలో కాలినడకన నడిచి ఆ ప్రాంత నివాసితులతో శానిటేషన్, త్రాగునీరు, విద్యుత్, ఉపాధి పనులు, తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ఓపెన్ ల్యాండ్ లను పరిశీలించి చెత్త పేరుకొని పోకుండా ఫెన్సింగ్ ఏర్పాటుకు సంబంధిత స్థల యజమానికి తెలియజేయాలని మునిసిపల్ అసిస్టెంట్ కమీషనర్ షఫీ ఉల్లాను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ నీటీ ప్రవాహానికి అంతరాయం లేకుండా కాల్వలను శుభ్రం చేయాలని అన్నారు. డ్రైయిన్లకు ఉన్న మరమ్మత్తులు పూర్తి చేయాలని, సిసి ఏర్పాటు చేయాలని, ప్రతి ఇంటికి చెత్త సేకరణ బండి వచ్చేలా చూడాలని, 3 బ్రిడ్జిల వద్ద చెత్త అధికంగా ఉందని, వీటిని ఎప్పటి కప్పుడు శుభ్రం చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. మున్నేరు నదీ పరివాహక ప్రాంతం మహిళలతో మాట్లాడుతూ, మహిళా సంఘాలు చర్చించుకొని టైలరింగ్, వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేసుకోవాలని, వాటి గ్రౌండింగ్ కు రుణాలు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బాగా చూస్తున్నారా, వైద్యం అందుతుందా వివరాలు తెలుసుకున్నారు. అక్కడున్న మహిళా తన అమ్మాయికి కంటి చూపు సమస్య ఉన్నదని తెలుపగా, సదరం క్యాంపులో చూపుకు సంబంధించి పరీక్షలు చేసి సర్టిఫికెట్ మంజూరు చేస్తామని అన్నారు. గతంలో వరద బీభత్సం వచ్చిందని, భవిష్యత్తులో వరద కష్టాలు పునరావృతం కావద్దంటే మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మించాలని, దీనికోసం ఎవరి ఇళ్లయినా తీయాల్సి వచ్చినా నూతన ఇండ్లు అందించిన తర్వాత తొలగిస్తామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. అంతకు ముందు మున్నేరు నదీ వద్ద శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానం దగ్గర ఉన్న సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద వద్ద కొబ్బరికాయ కొట్టారు. అక్కడ ఉన్న శివ సత్తులతో మాట్లాడుతూ, మున్నేరు వాగుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేస్తున్నామని, రిటైనింగ్ వాల్ నిర్మాణం అయిన తర్వాత గద్దెల వద్ద అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి, సౌకర్యాల కొరకు చర్యలు చేపడతామని తెలిపారు. ఇండ్లు లేని పేదలకు దశల వారిగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమీషనర్ షఫీ ఉల్లా, జవాను, మునిసిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 13:
ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
గురువారం జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి మున్నేరు నదీ పరివాహక ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా మంచికంటి నగర్, బొక్కలగడ్డ మున్నేరు నదీ ప్రాంతంలో కాలినడకన నడిచి ఆ ప్రాంత నివాసితులతో శానిటేషన్, త్రాగునీరు, విద్యుత్, ఉపాధి పనులు, తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ఓపెన్ ల్యాండ్ లను పరిశీలించి చెత్త పేరుకొని పోకుండా ఫెన్సింగ్ ఏర్పాటుకు సంబంధిత స్థల యజమానికి తెలియజేయాలని మునిసిపల్ అసిస్టెంట్ కమీషనర్ షఫీ ఉల్లాను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ నీటీ ప్రవాహానికి అంతరాయం లేకుండా కాల్వలను శుభ్రం చేయాలని అన్నారు. డ్రైయిన్లకు ఉన్న మరమ్మత్తులు పూర్తి చేయాలని, సిసి ఏర్పాటు చేయాలని, ప్రతి ఇంటికి చెత్త సేకరణ బండి వచ్చేలా చూడాలని, 3 బ్రిడ్జిల వద్ద చెత్త అధికంగా ఉందని, వీటిని ఎప్పటి కప్పుడు శుభ్రం చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
అంతకు ముందు మున్నేరు నదీ వద్ద శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానం దగ్గర ఉన్న సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద వద్ద కొబ్బరికాయ కొట్టారు. అక్కడ ఉన్న శివ సత్తులతో మాట్లాడుతూ, మున్నేరు వాగుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేస్తున్నామని, రిటైనింగ్ వాల్ నిర్మాణం అయిన తర్వాత గద్దెల వద్ద అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి, సౌకర్యాల కొరకు చర్యలు చేపడతామని తెలిపారు. ఇండ్లు లేని పేదలకు దశల వారిగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు.
