పారిశుద్ధ్య కార్యక్రమాలలో నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ సిబ్బందికి మెమోలు జారీ చేయండి..
- మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించిన జిల్లా కలెక్టర్
కామారెడ్డి జిల్లా :

శుక్రవారం కామారెడ్డి మున్సిపాలిటీలోని 15 వ వార్డులో గల వినాయక నగర్ లో అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసినారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలు మొదలగు వాటిని అత్యవసరంగా పునరుద్ధరణకు ఎస్డిఆర్ఎఫ్ క్రింద మంజూరు ఇచ్చిన పనులను వెంటనే పూర్తి చేయవలసిందిగా అధికారులను ఆదేశించినారు. శానిటేషన్ పనులు సక్రమంగా నిర్వహించని కారణంగా సీరియస్ గా పరిగణించి వెంటనే సంబంధిత ఏరియా సానిటరీ జవాన్ ఇన్స్పెక్టర్లకు 24 గంటలలో సమాధానం తెలియజేయుటకు షో కాజ్ నోటీస్ జారీ చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని ఆదేశించారు.
About The Author
08 Nov 2025
