రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు: ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరం ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 23 నుంచి 29 డిగ్రీల వరకు ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు: ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరం ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 23 నుంచి 29 డిగ్రీల వరకు ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

About The Author