రైతు భరోసా నిధుల.... విడుదలలో జాప్యం వద్దు

  • చేనుకు చేవ రైతుకు రొక్కం... రైతు భరోసా నిధులు
  • టిఆర్పిఎస్ ఆధ్వర్యంలో... 15వ విడత అన్నదాన కార్యక్రమం

రైతు భరోసా నిధుల.... విడుదలలో జాప్యం వద్దు

జవహర్ నగర్:

చేనుకు చేవ రైతుకు రొక్కం రైతు భరోసా నిధులేనని టిఆర్పిఎస్ అధ్యక్షురాలు ఇంద్రపాల భవాని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఈనెల 22న రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రి రైతు భరోసా నిధుల విడుదల విషయంలో మాట తప్పారని, ఈసారి మాట తప్పక రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ఆమె కోరారు. తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయం వద్ద  సోమవారం 15వ విడత రైతు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూడిసెంబర్ మాసంలో విడుదల కావలసిన రైతు భరోసా నిధులు మార్చి నెల వచ్చినా విడుదల కాకపోవడంతో సాగుకు పెట్టుబడి కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ  అప్పల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని  మూడుసార్లు మాట ఇచ్చారని కానీ రైతు భరోసా నిధులు విడుదల  కాలేదని తెలిపారు. వచ్చే బడ్జెట్లో రైతు సంక్షేమం కోసం  పెద్ద ఎత్తున కేటాయించాలని భవాని కోరారు. అనంతరం తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి ఇంద్రపాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి అనేకమంది బాధితులు తమ సమస్యల పరిష్కారంకోసం వస్తుంటారని అటువంటి వారి కోసం ఎంతోకొంత సహకారం అందించాలని ఉద్దేశంతో ప్రతి సోమవారం తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో  అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం సుమారు 100 మందికి అన్నదానం అందిస్తున్నామని  దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే మరి కొంతమందికి అన్నదానం అందిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో దావత్ అరుణ్, అంబాల విష్ణు, మల్లేష్, రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.WhatsApp Image 2026-03-16 at 18.56.12 (1)

About The Author