ఖమ్మంలో కాలేజ్ అమ్మాయిల పోస్ట్‌కార్డ్ ఉద్యమం – స్కూటీ గ్యారంటీపై నిరసన

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 13: ఖమ్మంలో నేడు పలు ప్రాంతాల్లో కాలేజ్ అమ్మాయిలు పోస్ట్‌కార్డ్ ఉద్యమాన్ని నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ‘స్కూటీ గ్యారంటీ’ ఇప్పటి వరకు అమలు చేయలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన యువతులకు ఉచిత స్కూటీ అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు గడుస్తున్నా ఈ హామీపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో కాలేజ్ అమ్మాయిలు నిరసన వ్యక్తం చేస్తున్నారు . ఈ నిరసనలో భాగంగా ప్రధాన పోస్టాఫీసులు , ప్రభుత్వ కార్యాలయాల వద్ద విద్యార్థినులు పోస్ట్‌కార్డులు పంపిస్తూ , తమ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు . ప్రభుత్వం వెంటనే తమ హామీని అమలు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని విద్యార్థినులు హెచ్చరించారు. స్కూటీ గ్యారంటీ అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని విద్యార్థినుల డిమాండ్.

ఖమ్మంలో కాలేజ్ అమ్మాయిల పోస్ట్‌కార్డ్ ఉద్యమం – స్కూటీ గ్యారంటీపై నిరసన

ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 13:

ఖమ్మంలో నేడు పలు ప్రాంతాల్లో కాలేజ్ అమ్మాయిలు పోస్ట్‌కార్డ్ ఉద్యమాన్ని నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ‘స్కూటీ గ్యారంటీ’ ఇప్పటి వరకు అమలు చేయలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన యువతులకు ఉచిత స్కూటీ అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు గడుస్తున్నా ఈ హామీపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో కాలేజ్ అమ్మాయిలు నిరసన వ్యక్తం చేస్తున్నారు . ఈ నిరసనలో భాగంగా ప్రధాన పోస్టాఫీసులు , ప్రభుత్వ కార్యాలయాల వద్ద విద్యార్థినులు పోస్ట్‌కార్డులు పంపిస్తూ , తమ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు . ప్రభుత్వం వెంటనే తమ హామీని అమలు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని విద్యార్థినులు హెచ్చరించారు. స్కూటీ గ్యారంటీ అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని విద్యార్థినుల డిమాండ్.

About The Author