ఎల్.బి.నగర్ డివిజన్ ఏర్పాటు దిశగా అడుగులు: మంత్రి శ్రీధర్ బాబుకు విన్నపం.
ఎల్.బి.నగర్:
శుక్రవారం రోజున ఎల్.బి.నగర్‌ను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే సుదీర్ఘ కాలపు డిమాండ్ సాకారం అయ్యే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశాన్ని రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లడంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి చొరవ చూపారు.
ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని సమస్యల పరిష్కారం, పాలనా సౌలభ్యం కోసం ప్రత్యేక డివిజన్ ఏర్పాటు ఆవశ్యకతను మంత్రికి వివరించడంలో మల్‌రెడ్డి రాంరెడ్డి పోషించిన పాత్రపై స్థానిక నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజల తరపున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. డివిజన్ ఏర్పాటు ద్వారా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువవుతాయని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు :
ఆడాల రమేష్,ఎండి జానీ మియా, నిమల్లూరు శ్రీనివాస్,గడ్డిఅన్నారం ఏ.ఎం.సీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి, అల్లి భాస్కర్ యాదవ్, గుండెల కిరణ్ కుమార్,రాజ్ కుమార్, చంద్రశేఖర్, మెట్టు జీవన్ రెడ్డి, అరుణ్ అంబేద్కర్, గుర్రం సతీష్, రాజు గౌడ్, ఆనంద్ కన్నా, జయంత్ కిట్టు, భాను చందర్, గోపి, అస్సాం, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
